Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
(Main Page నుండి దారిమార్పు చెందింది)
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,17,934 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
కొల్హాపూర్ మహాలక్ష్మీ ఆలయం

శ్రీ మహాలక్ష్మీ దేవాలయం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కొల్హాపూర్ లోని ఒక శక్తి పీఠం. ఇది హిందూ పురాణాల ప్రకారం శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతోంది. పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసముండే 108 శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.మహాలక్ష్మిని ప్రేమగా అంబా బాయి అనికూడా పిలుస్తారు, ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలను కోరుకుంటారు. ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా, కొల్హాపూర్, భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది. 7 వ శతాబ్దం లోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశ రాజైన కరన్‌దేవ్ తిరిగి చాలాకాలం తరువాత దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి హేమండ్ పతి ప్రేరణతో చేయబడింది. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8 వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని స్థానికుల నమ్మకం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్యకిరణాలు ప్రతిరోజూ దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు, భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్ కి తండోపతండాలుగా వస్తారు. ఈ సమయంలో ఈ ప్రాంతం ప్రకాశవంతమైన రంగులతో, సంగీతంతో ప్రతిధ్వనిస్తుంది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... విజిత మల్లికా సింహళ చిత్ర పరిశ్రమలో పేరొందిన తొలితరం నటీమణుల్లో ఒకరనీ!
  • ... తెలుగు దినపత్రికల్లో దేశాభిమాని తర్వాత రెండో పత్రిక శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి ఆధ్వర్యంలో వెలువడిన గౌతమి అనీ!
  • ... ఇస్రో నిర్మించతలపెట్టిన భారతీయ అంతరిక్ష స్థావరం లో వ్యోమగాములు 3 నుంచి 6 నెలలపాటు ఉండగలరనీ!
  • ... 2001లో ప్రపంచంలో మొదటిసారిగా స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన దేశం నెదర్లాండ్స్ అనీ!
  • ... మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదటిసారిగా వేదావతి హగరి నదిపై ఆనకట్ట నిర్మించాడనీ!
చరిత్రలో ఈ రోజు
జనవరి 3:
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.