Jump to content

పురాతన గ్రీసు

వికీపీడియా నుండి

పురాతన గ్రీసు (Ancient Greece) సా.శ.పూ 12-9 శతాబ్దాలలో ప్రారంభమైన అంధయుగపు గ్రీకుల కాలం నుంచి సా.శ 600 సంవత్సరాలలో క్లాసికల్ ఆంటిక్విటీ (శ్రేష్టమైన పూర్వకాలం) వరకు విలసిల్లిన ఈశాన్య మధ్యధరా నాగరికత. ఇది సంస్కృతి పరంగా, భాషాపరంగా వదులైన సంబంధం కలిగిన నగర-రాజ్యాలు, సమాజాల కలయిక. రోమన్ కాలానికి ముందు ఇవి కేవలం ఒక్క సమయంలో సా.శ.పూ 338-323 మధ్యలో మాసిడాన్ సామ్రాజ్యంలో భాగంగా ఏకీకృతమై ఉన్నాయి. పాశ్చాత్య చరిత్రలో క్లాసికల్ ఆంటిక్విటీ తర్వాత వెంటనే పూర్వ మధ్యయుగం, బైజాంటైన్ యుగం ప్రారంభమైంది.[1]

కాల పరిణామం

[మార్చు]

క్లాసికల్ ఆంటిక్విటీ (శ్రేష్టమైన పూర్వకాలం) మధ్యధరా ప్రాంతంలో సుమారు సా.శ.పూ 8వ శతాబ్దంలో[2] (ఇది సుమారు హోమర్ కవిత్వం రికార్డు అయిన కాలం) ప్రారంభమై సా.శ. 6వ శతాబ్దం చివరివరకు ఉందని అత్యధికుల భావన. దీనికి పూర్వం గ్రీసులో గ్రీకు అంధయుగం (సుమారు 1200 –  800 BC) ఉండేది. ఇది పురాతత్వ శాస్త్ర పరంగా కుండలపై ఉన్న డిజైన్లను ప్రోటోజియోమెట్రిక్, జియోమెట్రిక్ ఆధారంగా విశ్లేషణ చేశారు.

మూలాలు

[మార్చు]
  1. Thomas, Carol G. (1988). Paths from ancient Greece. Brill. pp. 27–50. ISBN 978-90-04-08846-7.
  2. Osborne, Robin (2009). Greece in the Making: 1200–479 BC. London: Routledge. p. xvii.